Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

శ్రీశైలం వెళ్లే భక్తులకు దేవస్థానం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-06-25 05:52 GMT

శ్రీశైలం వెళ్లే భక్తులకు దేవస్థానం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జులై ఒకటో తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకూ మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.34 గంటల వరకూ ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం కంప్యూటరైజర్డ్ టోకెన్ విధానాన్ని అమలులోకి తెస్తామని చెప్పారు.

ఈ రోజుల్లో మాత్రమే...
ప్రస్తుతం స్పర్శ దర్శనానికిసంబంధించి ఆలయ ప్రాంగణంలో టోకెన్లు జారీ చేస్తామని, కొద్ది రోజుల్లోనే ఆన్ లైన్ లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రవేశపెడతామని ఆలయ ఈవో చెప్పారు. టోకెన్ లో భక్తుల పేర్లతో పాటు ఆధార్ ఫోన్ నెంబరు, క్యూ ఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు. రోజుకు వెయ్యి మంది నుంచి పన్నెండు వందల మంది వరకూ ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తామని తెలిపారు. అయితే ప్రత్యేక పండగల సమయాల్లో మాత్రం ఈ స్పర్శ దర్శనం ఉండదని కూడా చెప్పారు.
















Tags:    

Similar News