శ్రీశైలానికి భక్తులకు ఇరవై నాలుగు గంటలూ అనుమతి

శ్రీశైలంలోకి భక్తులను ఇరవై నాలుగు గంటలూ అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు

Update: 2025-02-14 12:24 GMT

శ్రీశైలంలోకి భక్తులను ఇరవై నాలుగు గంటలూ అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శివరాత్రి సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా శ్రీశైలం చేరుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి వేళ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఘాట్ రోడ్ లో ప్రయాణించాలని ఆలయ అధికారులు కోరారు.

మహా శివరాత్రికి...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ చెప్పారు. అటవీ ప్రాంతంలోకి రెండున్నర లీటర్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చని, చెత్తకుండీల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటలకు ఉదయం 6 గంటల వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో అనుమతించరు. కానీ శివరాత్రి సందర్భంగా ఇరవై నాలుగు గంటలు అనుమతిస్తామని తెలిపారు.


Tags:    

Similar News