నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శనం టిక్కెట్లు
సింహాచలం నరసింహస్వామి భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు
సింహాచలం నరసింహస్వామి భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శనం టికెట్ల విక్రయాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 30న చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి సంబంధించి గురువారం టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని ఈవో సుబ్బారావు తెలిపారు.
ఈ వెబ్ సైట్ ద్వారా...
దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్ లై న్ లో ఈనెల 29 వరకు మూడు వందల రూపాయలు, వెయ్యి రూపాయల టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు ఆన్ లైన్ లో www.aptemples.ap.gov.in వెబ్సైటు ద్వారా 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు పొందవచ్చన్నారు.