నేడు నెల్లూరు మేయర్‍ పై అవిశ్వాసానికి?

నెల్లూరు మేయర్‍ పై అవిశ్వాసం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది.

Update: 2025-11-24 04:38 GMT

నెల్లూరు మేయర్‍ పై అవిశ్వాసం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్లతో సమావేశమయి చర్చించనున్నారు. నేడు ఎన్నికల అధికారికి అవిశ్వాస తీర్మానం కార్పొరేటర్లు ఇవ్వనున్నారు. నెల్లూరు మేయర్ గా ఎన్నికై నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టాలని టీడీపీ నిర్ణయించింది.

నలభై మంది కార్పొరేటర్లు...
మేయర్ పై పెట్టే అవిశ్వాస తీర్మానంపై దాదాపు మంది కార్పొరేటర్లు సంతకాలు పెట్టినట్లు తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్‍లో మొత్తం 54 మంది సభ్యులున్నారు. ఒకరి రాజీనామాతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 53గా ఉంది. మెజారిటీ సభ్యులుండటంతో అవిశ్వాస తీర్మానంపై ఎన్నికల అధికారి త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.


Tags:    

Similar News