Mahanadu : నేడు కడపలో రెండో రోజు మహానాడు

తెలుగుదేశం పార్టీ మహానాడు నేడు రెండో రోజుకు చేరుకుంది

Update: 2025-05-28 02:26 GMT

తెలుగుదేశం పార్టీ మహానాడు నేడు రెండో రోజుకు చేరుకుంది. కడపలో జరుగుతున్న మహానాడులో రెండో రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. రెండో రోజు కూడా పలు అంశాలపై చర్చించి తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది. మహానాడులో సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించనున్నారు. నేడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు జన్మదినం కావడంతో ఇప్పటికే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక అధికారికంగా ఎన్టీఆర్ జయంతి...
ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహానాడులోనూ నేడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.


Tags:    

Similar News