వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా? బాబు సవాల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2021-12-11 08:10 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన మాటలను అన్నింటిని తప్పతున్నారన్నారు. ప్రత్యేక హోదా మీద ఎందుకు పోరాటం చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఆ విషయాన్నే మర్చిపోయారన్నారు. ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. యువత అర్థం చేసుకోవాలన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై....
విశాఖ ప్రజలను కూడా జగన్ మోసం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరుగుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పోక్సో తో చర్చలు జరపిన మాట వాస్తవం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ ప్రజలు దీనిని గమనించాలని కోరారు. పోలవరం విషయంలో కూడా జగన్ వెనకడుగు వేశారన్నారు. పోలవరం జగన్ హయాంలో పూర్తి చేయలేరని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతిని జగన్ నాశనం చేశారని చంద్రబాబు అన్నారు.
రైల్వే జోన్ ఎక్కడ?
ప్రజలను పన్నుల రూపంలో దోచుకుతింటానికే జగన్ ముఖ్యమంత్రి వచ్చారన్నారు. చివరకు విశాఖ రైల్వే జోన్ కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో దోచుకుతింటమే తప్ప ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ ప్రజలను మోసం చేయడానికి జగన్ రెడీ అయిపోయారన్నారు. అమరావతిలో మూడేళ్లుగా ఒక్క పని చేపట్టలేదని చంద్రబాబు అన్నారు. న్యాయం కోసం పాదయాత్ర చేస్తుంటే రైతుల మీద కూడా కేసులు పెడుతున్నారన్నారు.
అప్పు చేసి మరీ...
ఏడు లక్షల కోట్లు అప్పలు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారన్నారు. కలెక్టరేట్లను తాకట్టు పెడుతున్నారన్నారు. పేదల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేయడం లేదన్నారు. పీఆర్సీని ప్రకటించకపోవడం, సీపీఎస్ ను రద్దు చేయకపోవడమే ఈ ప్రభుత్వ విధానాలుగా కన్పిస్తున్నాయన్నారు.


Tags:    

Similar News