బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే?
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఆయన అన్నారు. మీడియా చిట్ చాట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టును తాము అంగీకరించే ప్రసక్తి లేదని తెలిపారు. తాము ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తమ వైఖరిని తెలియజేశామని ఉత్తమ్ తెలిపారు.
త్వరలో కార్యాచరణ...
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో త్వరలోనే తాము కార్యాచరణ ను ప్రకటిస్తామని చెప్పారు. సముద్రంలో కలిసే నీరు అని ఏపీ నేతలు ఎలా చెబుతారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుపై తాము సరైన సమయంలో స్పందిస్తామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కేంద్రానికి ఇప్పటికే చెప్పామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.