Mallu Bhatti Vikramarka : బీజేపీ పై భట్టి ఫైర్... గౌరవం లేదంటూ?

భారతీయజనతా పార్టీపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-07-11 07:35 GMT

భారతీయజనతా పార్టీపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో ఆదివాసీలకు, దళితులకు గౌరవం లేదని అన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివాసీలు, దళితులకు వ్యతిరేకంగా ఉన్న రామచందర్ రావును బీజేపీ అధ్యక్షుడిగా చేశారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

రోహిత్ వేముల ఆత్మహత్యకు...
రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు దక్కుతున్నాయన్న మల్లు భట్టి విక్రమార్క రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రామచందర్ రావు యూనివర్సిటీకి వెళ్లి వత్తిడి తెచ్చారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రోహిత్ వేముల రాసిన లేఖ ను చదివితే దేశంలో ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందనిఅన్నారు. సుశీల్ కుమార్ ను ఢిల్లీ యూనివర్సిటీలో వీసీగా నియమించారు. దేశ ద్రోహులుగా చిత్రీకరించడం వల్లనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.


Tags:    

Similar News