Nara Lokesh : నారా లోకేష్ నోట సంచలన కామెంట్స్.. ఆ పదవి వద్దు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను జాతీయ ప్రధానకార్యదర్శి హోదాను తీసుకోనని ఆయన ప్రకటించారు. విశాఖపట్నంలో మీడియాతో నారా లోకేష్ మాట్లాడారు. ఒక నేతకు రెండుసార్లకు మించి పార్టీ పదవుల్లో ఉండకూడదని తనవ్యక్తిగత నిర్ణయమని, పార్టీ ఆదేశిస్తే తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని తెలిపారు.
ఒక వ్యక్తికి రెండుసార్లు...
తనతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా పదవిని చేపట్టబోరని ఆయన తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలన్నది తమ నిర్ణయమన్న లోకేష్ రెండుసార్లు పదవిలో ఉంటే ఒక ఏడాది గ్యాప్ ఉండాలని ఆయన కోరారు. దానివల్ల కిందిస్థాయిలోనే కాదు కష్టపడిన అందరునేతలకు పార్టీ పదవులతో పాటు అన్ని పదవులు దక్కుతాయని లోకేష్ అన్నారు.