మండలి నుంచి టిడిపి సభ్యులు సస్పెండ్

సభా కార్యక్రమాలకు టిడిపి సభ్యులు అడ్డుపడుతున్న దృష్ట్యా ఎమ్మెల్సీలు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి,

Update: 2022-03-24 07:42 GMT

అమరావతి : ఏపీ శాసనమండలి నుంచి టిడిపి సభ్యులు సస్పెండ్ అయ్యారు. మండలి చైర్మన్ మోసెస్ రాజు టిడిపి ఎమ్మెల్సీలను ఒకరోజు సస్పెండ్ చేశారు. ఏపీలో కల్తీ సారా మరణాలు, జే మద్యాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. కల్తీసారా మరణాలను సహజ మరణాలుగా చూపిస్తున్నారని, అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని మండలిలో టిడిపి ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఏ మేరకు చేశారో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దాంతో ఏడుగురు ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ సస్పెండ్ చేశారు.

సభా కార్యక్రమాలకు టిడిపి సభ్యులు అడ్డుపడుతున్న దృష్ట్యా ఎమ్మెల్సీలు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ప్రభాకర్ ను ఒకరోజు సస్పెండ్ చేయాలని మంత్రి అప్పలరాజు మండలి చైర్మన్‌ను కోరారు. దీంతో టిడిపి ఎమ్మెల్సీలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి కన్నబాబు ప్రసంగానికి టిడిపి సభ్యులు అడ్డుతగిలారు. మండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోసారి మండలిలో టిడిపి సభ్యులు చిడతలు వాయించారు. టిడిపి సభ్యుల ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన మండలి చైర్మన్ వారిని బయటకు పంపాలని ఆదేశించి, సభను రేపటికి వాయిదా వేశారు.


Tags:    

Similar News