TDP : పనితీరు బాగాలేని ఆ 37 మంది ఎమ్మెల్యేలు వీరేనట

తెలుగుదేశం పార్టీకి చెందిన 37 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందింది.

Update: 2025-12-10 08:01 GMT

తెలుగుదేశం పార్టీకి చెందిన 37 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందింది. బ్యాక్ ఎండ్ టీం ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇప్పటి వరకూ ఏమాత్రం మెరుగుపడలేదని నివేదిక ఇచ్చింది. అయితే ఇది వారికి ఫైనల్ కాల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిసింది. గత కొన్నాళ్లుగా అందుతున్న నివేదికలను అనుసరించి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపర్చుకోవాలని పదే పదే చెబుతున్నారు. ప్రజల్లోనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెబుతున్నారు. అయినా పెద్దగా ఎమ్మెల్యేలు లెక్కచేయని పరిస్థితి ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి.

చంద్రబాబు ఆదేశాలను కూడా...
ప్రతి నెల సాక్షాత్తూ చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛను పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. అలాగే సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలను కూడా స్వయంగా ఎమ్మెల్యేలు చేయాలని చెప్పినా లైట్ తీసుకుంటున్నారు. అనేకసార్లు చంద్రబాబు వారికి క్లాస్ లు పీకారు. అయితే గుంపులో గోవిందా అన్నట్లుగా వారు తమను కాదులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపర్చుకోకపోవడం పై ఒక వరసగా వన్ టూ వన్ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
వన్ టూ వన్ పిలిచి...
త్వరలోనే ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వారితో మాట్లాడేందుకు సిద్ధం చేయాలని పార్టీ నేతలకు ఆదేశించినట్లు తెలిసింది. 37 మంది పనితీరు బాగాలేదంటే చిన్న విషయం కాదు. చిన్న అంకె కూడా కాదు. వారి వల్ల భవిష్యత్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై పడే అవకాశం కూడా ఉందని భావించిన చంద్రబాబు నాయుడు ఇది ఫైనల్ కాల్ అని, అప్పటికీ వారు పనితీరు మార్చుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో వారిని తప్పించి మరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే చివరి హెచ్చరికలతోనైనా వారు తమ వ్యాపారాలను, ఇతర వ్యవహారాలను పక్కన పెట్టి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సేవ చేయాలని చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకుతారంటున్నారు. అప్పటికైనా మారతారా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News