జగన్ ను గోరంట్ల ఇలా అనేశారేంటి?
వైసీపీ అధినేత వైఎస్ జగన్‍పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‍పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా జగన్ పర్యటనలు కొనసాగుతున్నాయని బుచ్చయ్య చౌదరి అన్నారు. పొట్టేళ్లను నరికినట్టు నరికితే తప్పేంటి అని జగన్ అంటున్నాడని, జగన్ తల నరకొచ్చు కదా అని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
జగన్ తల నరకొచ్చు కదా?
జగన్ విధానాన్ని తాము అవలంభించలేమా? అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తిరగబడితే జగన్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలంటూ జగన్ కు హెచ్చరికలను బుచ్చయ్య చౌదరి జారీ చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జగన్ వెళ్తున్నాంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.