Mahanadu : నేటి నుంచి కడపలో మహానాడు

నేటి నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడపలో జరగనుంది

Update: 2025-05-27 01:40 GMT

నేటి నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడపలో జరగనుంది. ఆరు ప్రధాన అంశాలపై చర్చలు, తీర్మానాలు ఈ మహానాడులో చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు భారీ ఏర్పాట్లు చేశారు. మొన్నటి ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపను ఎంచుకుని మరీ ఈసారి అక్కడే మహానాడును నిర్వహిస్తుండటం విశేషం.

మూడు రోజుల పాటు...
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, నేతలు నిన్న రాత్రి కడపకు చేరుకున్నారు. కడప శివారులోని చెర్లోపల్లిలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 140 ఎకరాల్లో మహానాడును నిర్వహిస్తున్నారు. వాహనాల పార్కింగ్ కు నాలుగు వందల యాభై ఎకరాలు కేటాయించారు. వేదికమీద 450 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. మహానాడు చివరి రోజు అంటే ఈ నెల 29వ తేదీన ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News