లోకేష్ ఉపముఖ్యమంత్రి పదవిపై పార్టీ ఇచ్చిన క్లారిటీ ఇదే
నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి డిమాండ్ పదవిపై పార్టీ అధినాయకత్వం నేతలకు క్లారిటీ ఇచ్చింది
నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి డిమాండ్ పదవిపై పార్టీ అధినాయకత్వం నేతలకు క్లారిటీ ఇచ్చింది. నేతలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని కోరింది. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలన్నది నేతల వ్యక్తిగత అభిప్రాయమైనప్పటికీ బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ సూచించింది. అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కూటమి నేతలు కలసి కూర్చుని తీసుకునే నిర్ణయాలని తెలిపింది.
వ్యక్తిగత నిర్ణయాలను...
వారు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటారని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేయవద్దని సూచించింది. గత రెండు రోజులుగా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు పదే పదే ప్రకటనలు చేయడంతో అధిష్టాన వర్గం నష్టనివారణ చర్యలకు దిగింది. ఇటువంటి వ్యాఖ్యానాలు ఇక ఆపాలని కోరింది. ఎవరూ పార్టీ నిర్ణయాల గురించి మీడియా ఎదుట ప్రస్తావించవద్దని పేర్కొంది.