Chandrababu : అందుకే వారికి టిక్కెట్లు ఇవ్వలేకపోయా.. సారీ

పొత్తుల కారణంగా కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2024-03-23 07:02 GMT

పొత్తుల కారణంగా కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పొత్తుల కారణంగా 31 మందికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని తగిన రీతిలో గౌరవిస్తామని తెలిపారు. మూడు పార్టీలో ఈప్రభుత్వంపై పోరాటం చేసిన వారున్నారన్న చంద్రబాబు అందరూ సహకరిస్తేనే విజయం సాధ్యమవుతుందన్నారు. మనం చేస్తుంది కేవలం పోరాటం కాదని, యుద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థుల వర్క్‌ షాప్ లో చంద్రబాబు మాట్లాడారు. జగన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించడం మామూలయిపోయిందన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని డ్రగ్స్ కేపిటల్ గా మార్చేశారన్నారు.

వైసీపీని కట్టడి చేయాలంటే...
వైసీపీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీని తీసుకురావడమే మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే తాను పెద్దనోట్లను రద్దు చేయాలని కోరుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ ఒక్కరోజు కూడా డ్రగ్స్, గంజాయి మీద సమీక్ష జరపలేదని, కాకినాడ ఎమ్మెల్యే నేతృత్వంలోనే డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. జగన్ ను అరాచకాలను అడ్డుకోవాలంటే ప్రజలను భాగస్వామ్యులను చేసి అన్ని పార్టీలు కలసి సమిష్టిగా పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ సంకల్పం తీసుకున్నారన్న చంద్రబాబు బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కేలా చూశామన్నారు. అందరూ కలసి మూడు పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News