పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు వంద కోట్లు ఖర్చు చేశారు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పటివరకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పటివరకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారన్నారు. ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని, అవినీతి సొమ్ము ను పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని బీటెక్ రవి ఆరోపిచంారు. జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారని బీటెక్ రవి తెలిపారు.
బెదిరిస్తూ...
వైసీపీకి అనుకూలంగా చేయకపోతే వచ్చేది తమ ప్రభుత్వమే మీ అంతు చూస్తానని పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తొలుత ప్రలోభపెట్టారని, విననిపక్షాన బెదిరిస్తున్నారని, అనేక రకాలుగా దౌర్జన్యాలు చేశారని బీటెక్ రవి అన్నారు. ఈ 35 సంవత్సరాల్లో తొలిసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేయించి నేడు ప్రజాస్వామ్యయుతంగా పోటీకి దిగుతుంటే.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓట్లు రావని టీడీపీ మీద ఇష్టమొచ్చినట్లు వారి సొంత మీడియా లో దుష్ప్రచారం చేశారన్నారు. పులివెందుల ప్రజలు అన్నీ గ్రహించారని, జరగబోయే పోలింగ్ లో ప్రజలు తమవైపే ఉన్నారని బీటెక్ రవి చెప్పారు.