వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జంపింగ్ లు ఎక్కువగానే ఉంటాయి. తాజాగా వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చేరారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన 1994లో పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.
1994 లో గెలిచిన తర్వాత...
1994లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీనాథ్ రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలోనే ఉన్నా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జి.వి శ్రీనాధ్ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరారు.