నేడు గుడివాడలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గుడివాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలో పాల్గొననున్నారు

Update: 2023-04-13 04:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గుడివాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలో పాల్గొననున్నారు. నిన్న రాత్రికి నిమ్మకూరులో బస చేసిన చంద్రబాబు ఈరోజు గుడివాడ చేరుకుంటారు. దీంతో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశాయి. భారీగా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాయి. గుడివాడలో టీడీపీ జెండా ఈసారి ఎగురవేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న చంద్రబాబు మాజీ మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేసే అవకాశాలున్నాయి.

భారీ బందోబస్తు...
గుడివాడ టీడీపీకి కొరకరాని కొయ్యగా మారడంతో అనేకసార్లు అభ్యర్థులను మార్చినా ప్రయోజనం లేకపోవడంతో ఈసారి కూడా మరొక కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. గుడివాడ టీడీపీలో గ్రూపుల గోల లేకుండా చంద్రబాబు ఈరోజు సర్దుబాటు చేసే అవకాశముంది. ఉన్న రెండు మూడు గ్రూపులతో ప్రత్యేకంగా సమావేశమై కొంత క్లారిటీ ఇచ్చే అవకాశముందని తెలిసింది. అయితే గుడివాడలో కొడాలి నాని అనుచరులు ఆందోళనకు దిగే అవకాశముందని తెలియడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News