పోలవరం వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు ధర్నా

పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. చూసేందుకు అనుమతి లేదని తెలిపారు

Update: 2022-12-01 12:50 GMT

పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. చూసేందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లలో రెండో రోజు పర్యటనలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పర్యటించేందుకు వెళ్లారు. అయితే ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రాజెక్టు సందర్శనకు...
పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ చేతలకు, మాటలకు పొంతన ఉండదని ఆయన అన్నారు. పోలవరం వద్దకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారి ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టును బలి పశువును చేశారన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డుపైనే చంద్రబాబు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎలాంటి అవినీతి చేయకపోతే ఎందుకు అడ్డుకున్నారని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులకు, చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకు ఉందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News