విధ్వేషం కాదు.. విజన్ కావాలి

పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు.

Update: 2022-09-02 06:28 GMT

పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ అందించిన రెండు రూపాయలకు కిలో బియ్యం తో సంక్షేమ పథకాల యుగం ప్రారంభమయిందన్నారు. తెలుగుదేశం పాలనలోనే సంక్షేమం ఎక్కువగా జరిగిందన్నారు. ప్రజలను పాలనలో భాగస్వామ్యులను చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు. తన విజన్ తో హైదరాబాద్ లో ఐటీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తనను గుర్తు పెట్టకోక పోయినా చేసిన పనులు సంతృప్తినిస్తాయని అన్నారు.

సంక్షేమ పథకాలను....
రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో దేశంగా తయారవుతుందన్నారు. భారత్ కు ఆ శక్తి ఉందన్నారు. భారత్ కు యువత పెద్ద ఆస్తి అని అన్నారు. అయితే మన రాష్ట్రంలో విధ్వేష రాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో మనం చూశామన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో ఒక కానిస్టేబుల్ తనకు న్యాయం చేయాలని కోరితే ఉద్యోగం ఊడబెరికారన్నారు. విభజన జరగడం బాధాకరమని, అయితే ఆ సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. బీసీలకు ఆదరణ కార్యక్రమం నిలిపేశారన్నారు. రైతులు ఈ ప్రభుత్వంలో ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ఉచితంగా వచ్చే ఇసుకను ఇప్పుడు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏ రంగంలోనూ ప్రజలు సంతృప్తికరంగా లేరని అన్నారు. జగన్ అవినీతి రెండు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయిందన్నారు చంద్రబాబు.


Tags:    

Similar News