Chandrababu నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు తిరువూరు లో పర్యటించనున్నారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు
tdp chief chandrababu naidu will visit tiruvuru today
TDP Chandrababu naidu:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు తిరువూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వరస బహిరంగ సభలు టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరువూరులో దాదాపు అరవై ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు ఈ సభకు తరలి రానున్నారు.
కేశినేని నాని మాత్రం...
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మాత్రం ఈ సభకు గైర్హాజరు కానున్నారు. ఆయనను ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి కేశినేని చిన్నికి బాధ్యతలను అప్పగించడంతో కేశినేని నానిని హాజరు కావద్దని చెప్పారు. దీంతో కేశినేని నాని వర్గీయుుల సభ వద్ద ఎలాంటి ఆందోళనకు దిగుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అనంతరం చంద్రబాబు ఇక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మళ్లీ రాత్రికి రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు.