నేడు చంద్రబాబు డుమ్మా కొడతారా?
చంద్రబాబు అసెంబ్లీకి రాక పోవచ్చు. ఆయన నిన్ననే హైదరాబాద్ కు వెళ్లిపోయారు.
చంద్రబాబు అసెంబ్లీకి రాక పోవచ్చు. ఆయన నిన్ననే హైదరాబాద్ కు వెళ్లిపోయారు. నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఒకరోజు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో ఒకరోజు సమావేశాలు పెట్టి ముగించనున్నారు. వచ్చే నెలలో వర్షాకాల సమావేశాలు పూర్తి స్థాయిలో జరపాలని నిర్ణయించారు. అయితే ఈ ఒకరోజు సమావేశానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు లేవు.
నిన్ననే హైదరాబాద్ కు...
ఆయన నిన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి ఉండవల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. కుప్పం రిజల్ట్ తో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈరోజు అసెంబ్లీ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. హాజరుకాకుంటే తొలిసారి చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండినట్లవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒక రోజు సమావేశాల్లో ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదించుకోనుంది.