సీనియర్లు పని తగ్గించేసుకున్నారు.. చంద్రబాబు సీరియస్

సీనియారిటీ పెరిగి పోవడంతో పనిని తగ్గించేసుకున్నారని టీడీపీ నేతలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2022-10-01 02:27 GMT

సీనియారిటీ పెరిగి పోవడంతో పనిని తగ్గించేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేతలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల, గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పని తక్కువగా చేస్తూ ప్రకటనలు ఎక్కువగా చేస్తుండటం వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని ఆయన గట్టిగానే హెచ్చరించారు. జిల్లాలో ఉన్న సమస్యలపై స్పందించేందుు ముందుకు రాకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నేతల మధ్య సమన్వయలోపాన్ని సరి చేసుకోవాలని సూచించారు. పార్టీకి బలమైన గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే రేపు ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని ఆయన నిలదీసినట్లు సమాచారం.

ప్రజల్లో లేకుంటే....
గుంటూరు జిల్లాలోనే సీఐడీ కార్యాలయం, కోర్టు ఉన్నాయని, టీడీపీ నేతలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని చెప్పినా ఎందుకు యాక్ట్ కావడం లేదని ఆయన నిలదీశారు. సీనియర్లు కేవలం పని తగ్గించుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన సెటైర్ వేశారు. తనకు అంతా తెలుస్తుందని, పనిచేసే వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతుంటేనే గెలుపు సాధ్యమవుతుందని చెప్పారు. పని చేయకుంటే వెనుకపడి పోతారు ఇక మీ ఇష్టం అందుకు మీకే వదిలేస్తున్నా అని చెప్పారు. గుంటూరు జిల్లాలో అందరూ పెద్దనాయకులేనని అయినా పార్టీ బలోపేతం చేయడంలో మాత్రం కలసి పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


Tags:    

Similar News