Chandrababu : మంత్రులపై చంద్రబాబు సీరియస్

మంత్రులు, ఎంపీల సమావేశానికి హాజరుకాని నేతలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌ అయ్యారు.

Update: 2025-01-18 02:42 GMT

మంత్రులు, ఎంపీల సమావేశానికి హాజరుకాని నేతలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కీలక సమావేశానికి ఎంపీలు కొంతమంది రాకపోవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ మీటింగ్‌కు రాలేదో చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్టీకి సంబంధించిన విషయాలను చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే ఎందుకు రాలేక పోయారో వివరణ ఇవ్వాలని కోరారు.

గైర్హాజరయిన ఎంపీలపై కూడా...
నిన్న సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి కొందరు మంత్రులు, ఎంపీలు డుమ్మా కొట్టడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించినవారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. హాజరు కాని వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు.


Tags:    

Similar News