జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Update: 2023-01-03 06:12 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తారని భావించి జేసీ ప్రభాకర్ రెడ్డిని ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు.

టెన్షన్ చోటు చేసుకోవడంతో...
తాడిపత్రిలో ఇటీవల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ,టీడీపీ నేతల మధ్య ఘర్షణలు తరచూ జరుగుతున్నాయి. వైఎస్సార్ పింఛను వారోత్సవాలు జరుగుతుండటంతో మరొక సారి టెన్షన్ వాతావరణం ఏర్పడే అవకాశముందని భావించి ముందు జాగ్రత్త చర్యగా జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News