టంగ్ స్లిప్ అవలేదు.. అవన్నీ నిజాలే : తగ్గేదే లే అంటున్న జేసీ

కేటీఆర్ టంగ్ స్లిప్ అవ్వలేదని, ఏపీ గురించి ఆయన అన్నీ నిజాలే చెప్పారని స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన వాఖ్యలకు ధైర్యంగా కట్టుబడి

Update: 2022-05-02 11:02 GMT

తాడిపత్రి : ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీలో నీళ్లు, రోడ్లు, కరెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద రాజకీయ దుమారమే రేగింది. కేటీఆర్ చెప్పిన దాంట్లో తప్పేముందని ఏపీ విపక్షాలు అంటే.. ఒకసారి ఇక్కడికొచ్చి చూస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో తెలుస్తుందని అధికార పార్టీ నేతలు, మంత్రులు కేటీఆర్ కు బదులిచ్చారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ టంగ్ స్లిప్ అవ్వలేదని, ఏపీ గురించి ఆయన అన్నీ నిజాలే చెప్పారని స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన వాఖ్యలకు ధైర్యంగా కట్టుబడి ఉండాలని, భయపడాల్సిన పని లేదని జేసీ పేర్కొన్నారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు బాగా లేవన్నారు. భవిష్యత్తు నాయకుడు ధైర్యంగా ఉండాలంటూ కేటీఆర్ కు జేసీ సూచించారు. కేటీఆర్ నిజాలు చెప్పి మాట మారుస్తారెందుకు? మాట మీద నిలబడండి అని అన్నారు. తగ్గొద్దు.. తగ్గేదేలే అంటూ కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మీరు ఇక్కడికి వస్తే.. మీ వెనకే ఉండి రాష్ట్రంలో పరిస్థితులను చూపిస్తానన్నారు.
కాగా.. కేటీఆర్ మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నాయనే విషయాన్నీ చెప్పేందుకు ఏపీని చూపిస్తున్నారని ఏపీ మంత్రులు మండిపడిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ మంత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి ఏపీ గురించి అలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఏపీకి 4 కాదు 40 బస్సులు వేసుకురావాలని మంత్రి అప్పలరాజు కేటీఆర్‌కు సవాల్ విసిరారు.



Tags:    

Similar News