నేటి నుంచి ఏపీలో ప్రారంభమయిన సర్వే

ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న P4 కోసం ఈనెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం ప్రారంభం అయింది

Update: 2025-03-08 05:28 GMT

పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 కోసం ఈనెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం ప్రారంభం అయింది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇరవై ఏడు ప్రశ్నల ద్వారా...
కుటుంబ వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం ఇరవై ఏడు ప్రశ్నల ద్వారా సమాచారం సేక రించనున్నారు. సర్వే పూర్తయ్యాక ఈనెల 21వ తేదీన సమాచార జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు . ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామి కవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని చంద్రబాబు చెప్పడంతో అధికారులు దానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటారు.


Tags:    

Similar News