ఏపీ, తెలంగాణలలో నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలయిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలయిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి లోబడి ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈరోజు సుప్రీంకోర్టులో డీలిమిటేషన్ పై దాఖలయిన పిటీషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్నాసనం తీర్పు చెప్పింది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం...
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిలీమిటేషన్ చేయాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జమ్మూకాశ్మీర్ లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచలేదని పిటీషన్ కోరారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటీషన్ ను కొట్టివేసింది. రాజ్యాంగానికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని తెలిపింది.