రెండు రోజులు డేంజర్... 46 డిగ్రీలు

కోస్తాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు

Update: 2022-06-03 02:25 GMT

కోస్తాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనిపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు....
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు, రేపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని సూచిస్తుంది. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.


Tags:    

Similar News