Breaking : వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై విచారించేందుకు ఈ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ చేయనుంది.
గన్నవరం నియోజకవర్గంలో...
గన్నవరం నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు అక్రమంగా జరపడమే కాకుండా భూములను కబ్జా చేయడమే కాకుండా తక్కువ ధరకే బెదరించి భూములను సొంతం చేసుకున్న దానిపై కూడా విచారణ చేపట్టనుంది. ఇప్పటికే వంశీ తమ భూమిని ఆక్రమించుకున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో వాటిని సిట్ కు అందచేయనున్నారు.