తొలి అడుగులో అచ్చెన్న
సుపరిపానలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు
సుపరిపానలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడి గ్రామంలో అచ్చెన్నాయుడు పర్యటించారు. అచ్చెన్నాయుడిక గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు మంత్రి అచ్చెన్న వివరించారు.
ప్రతి ఇంటికి తిరుగుతూ...
ఏడాదిలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని వివరిస్తుంచారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ఏ మేరకు అమలు చేశామని చెప్పుకొస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలను దాదాపుగా పూర్తి చేశామన్న మంత్రి అచ్చన్నాయుడు గత ఐదేళ్లలో రాష్ట్రం వదిలి వెళ్లిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,లోకేష్ తిరిగి తెస్తున్నారని చెప్పారు.