Srisailam : శ్రీశైలం వెళ్లే వారికి అలెర్ట్.. మీరు ఇలా వెళ్లాల్సిందే
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో శ్రీశైలం వెళ్లే రాకపోకలపై నిషేధం విధించారు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో శ్రీశైలం వెళ్లే రాకపోకలపై నిషేధం విధించారు. శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. రేపు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రానున్నారు. శ్రీ భ్రమరాంభిక మల్లికార్జులన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో పూర్తిగా ట్రాఫిక్ ను నిలిపి వేయనున్నారు.
రేపు ఉదయం నుంచి...
రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అలాగే రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేవారు, దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లేవారిని అనుమతించరు. ప్రధాని పర్యటన శ్రీశైలంలో ముగిసిన అనంతరమే ఘాట్ రోడ్డులో పోలీసులు అనుమతిస్తారు.