Srisailam : శ్రీశైలం ఆలయ అధికారుల కీలక నిర్ణయం.. రేపటి నుంచి రెండు నెలల పాటు ఆలయ యాత్రకు బ్రేక్

శ్రీశైలం ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు

Update: 2025-06-30 07:26 GMT

శ్రీశైలం ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు అటవీశాఖ అధికారులు యాత్రను నిలిపి వేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు అటవీశాఖ అధికారులు విరామం ఇచ్చారు.

యాత్రకు బ్రేక్...
జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ వాహనాలు నడుపుతుంది. అయితే దాదాపు రెండునెలల పాటు ఈ ఆలయానికి సంబంధించి యాత్రలను బ్రేక్ వేశారు. పులుల సంఖ్య పెరగడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు తమ నిర్ణయానికి సహకారాన్ని అందించాలని కోరుతున్నారు


Tags:    

Similar News