Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది.

Update: 2025-07-03 03:57 GMT

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 66,746 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.60 అడుగులకు చేరుకుంది.

విద్యుత్తు ఉత్పత్తి..
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 166.3148 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత వరద నీరు చేరే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News