రెవెన్యూ మంత్రికి అయ్యన లేఖ.. విచారణ జరపాలంటూ?

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‍కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు

Update: 2025-08-03 05:25 GMT

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‍కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. విశాఖపట్నం భూఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని అయ్యయ్యపాత్రుడు లేఖ రాశారు. మాజీ సైనికుల భూముల ఎన్‍వోసీల జారీలో అక్రమాలపై మూర్తియాదవ్ ఇప్పటికే ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ జరపాలని కోరారు. అక్రమాలపై ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు పేరును కూడా మూర్తియాదవ్ ప్రస్తావించారు.

తన పేరును ప్రస్తావించడంపై...
తన పేరును మూర్తి యాదవ్ ప్రస్తావించడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు విచారణకు ఆదేశించారు. మూర్తి యాదవ్ ఆరోపణలపై ఎండాడ-2 లో భూములకు ఎన్‍వోసీ ప్రక్రియపై విచారణ జరపాలన్నారు. ఎండాడ-2లోని సర్వే నం.14-1లో 5.10 ఎకరాలకు సంబంధించిన ఎన్‍వోసీ జారీపై విచారణకు వినతి పత్రం అందచేశారని, సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని రెవెన్యూ మంత్రికి అయ్యన్నపాత్రుడు లేఖ రాశాడు. విశాఖ భూఅక్రమాలపై గతంలోనూ పోరాడానని లేఖలో పేర్కొన్న స్పీకర్ అయ్యన్నవిశాఖలో ఎంతో విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తెలిపారు.


Tags:    

Similar News