జగన్ ప్రతిపక్ష హోదాపై అయ్యన్న తేల్చేశారుగా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-03-05 04:01 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. అభియోగాలు, బెదిరింపులతో తనకు లేఖ రాశారన్న అయ్యన్న పాత్రుడు వైసీపీకి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చారు. ఆయన కావాలనుకుంటే న్యాయస్థానానికి వెళ్లవచ్చని తెలిపారు. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని అయ్యన్న పాత్రుడు తెలిపారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ...
లోక్ సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా అప్పట్లో ఇవ్వలేదని అయ్యన్న పాత్రుడు, అది వాస్తవం కాదని తెలిపారు. గతంలో జగన్ చేసిన కామెంట్స్ ను కూడా ఆయన గుర్తు చేశారు. పద్దెనిమిది సీట్లు లేకుండా తాను చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలగనని జగన్ అన్న వ్యాఖ్యలను అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా అన్నారు.


Tags:    

Similar News