శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు.

Update: 2025-08-15 04:10 GMT

శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వరస సెలవులు రావడంతో ఒక్కసారిగా భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలి వచ్చారు. శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

వరస సెలవులతో...
భక్తుల రద్దీతో ఈనెల 18 వరకు స్పర్శదర్శనాలు రద్దు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు శ్రావణమాసం, వరుస సెలవుల కారణంగా స్పర్శదర్శనాలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని ఆలయ అధికారులు కోరారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ కూడా బాగా పెరగడంతో ట్రాఫిక్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News