Weather Report : రోహిణి దంచి కొడుతుందిగా... ఇవేం ఎండలు.. ఇదేం ఉక్కపోత?

నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. దీంతో ఉక్కపోతతో పాటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

Update: 2025-06-07 02:38 GMT

రోహిణి కార్తె తన ప్రభావాన్ని చూపుతుంది. అకాల వర్షాలు, నైరుతి రుతు పవనాలు ముందుగానే రావడంతో ఈ ఏడాది రోహిణి కార్తెను తప్పించుకున్నట్లే అనుకున్నప్పటికీ కానీ రివర్స్ కొడుతుంది. నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. దీంతో ఉక్కపోతతో పాటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలు పడటం వల్ల మరింత ఉక్కపోత, తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ చల్లటి వాతావరణంతో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు వేడిమితో ఉడికెక్కిపోతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇలాంటి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు.

పగటి ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్టంగా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చిన్న బ్రేక్ తీసుకున్నట్లు కనపడుతుంది. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు వేడెక్కాయి. దక్షిణ భారతదేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాల వద్ద నైరుతి రుతుపవనాల కదలికలు ఆగిపోయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో పగటి వేళ గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండమే నైరుతి రుతుపవనాల కదలికలు నిలిచిపోయినట్లు వాతావరణ కేంద్ర తెలిపింది.
తెలంగాణలోనూ...
అందువల్లనే పొడిగాలులతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే మరో వారం రోజుల పాటు ఇలాంటి పరిస్థితులుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు సాయంత్రానికి చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో విద్యుత్తు వాడకం పెరిగింది. ఏసీ, ఫ్యాన్ల వాడకం కూడా గత మూడు రోజుల నుంచి పెరగిందని ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.


Tags:    

Similar News