Vandebharath : బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-12-04 02:17 GMT

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కలబుర్గి–బెంగళూరు వందేభారత్‌ మార్గంలో మార్పులు చేసింది. కలబుర్గి–. బెంగళూరు–కలబుర్గి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మార్గం మార్చేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చిందని దక్షిణ పశ్చిమ రైల్వే తెలిపింది. ఈ మార్పు వల్ల శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వద్ద అదనపు స్టాప్‌ కల్పించారు.

జనవరి ఒకటోతేదీ నుంచి
ఈ మార్పు 2026 జనవరి 1వ తేదీ నుంచి కలబుర్గి దిశలో, జనవరి 2 నుంచి ఎస్‌.ఎం.వి.టి. బెంగళూరు దిశలో ఈ మార్పు అమల్లోకి వస్తుందని అధికారులు చెప్పారు. ప్రజలు, యాత్రికులు, భక్తులకు ఈ మార్గం ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. దీనివల్ల బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం మరింత సులువుగా మారనుంది. పుట్టపర్తిలో స్టాప్ కారణంగా చాలా మందికి ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News