తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-09-23 06:59 GMT

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి నుంచి రాక్సౌల్ వెళ్లే చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలును తిరుపతి వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఈ నెల చివరి నుండి ఈ రైలు తిరుపతి వరకూ ప్రయాణిస్తుందని తెలిపింది. తిరుపతి నుంచి బీహార్ లోని రాక్సౌల్ కు వారానికి ఒకసారి నడిచే ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 27వ తేదీ నుంచి నవంబరు 29 వ తేదీ వరకూ శనివారం నుంచి తిరుపతి నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.

తిరుగు ప్రయాణంలో...
అలాగే తిరుగు ప్రయాణంలో రాక్సౌల్–తిరుపతి వారానికి ఒకసారి నడిచే ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 2 వరకు నడుస్తుంది. చర్లపల్లి–రాక్సౌల్ టైమింగ్స్‌లో మార్పుల్లేవని తెలిపింది. ఈ రైలు రేణిగుంట, కడప, గుంటకల్, ఆదోని, సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా రాక్సౌల్ వరకు వెళ్తుంది. చార్లపల్లి - రాక్సౌల్ మధ్య ప్రస్తుత టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులుండబోవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి భక్తులు, దూరప్రయాణికులకు దీనివల్ల మరింత ప్రయాణం సులభమవుతుందని తెలిపింది.


Tags:    

Similar News