Andhra Pradesh : నేటి నుంచి స్మార్ రేషన్ కార్డుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది

Update: 2025-08-25 02:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. ఈరోజు నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద అందజేస్తామని చెప్పారు.

తొమ్మిది జిల్లాల్లో...
ఈ మేరకు నాదెండ్ల మనోహర్ నమూనా స్మార్ట్ రేషన్ కార్డులు విడుదల చేశారు. మొదటి విడత ఈ నెల 25వ తేదీ నుంచి 9 జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంపిణీ చేస్తామని చెప్పారు. ఈరోజు ఈ జిల్లాల్లో తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.


Tags:    

Similar News