స్లీపింగ్‌ పాడ్‌లు రోజంతా 600 రూపాయలకే

వేరే ఊర్లకు వెళితే లాడ్జిలకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది.

Update: 2025-07-11 13:00 GMT

వేరే ఊర్లకు వెళితే లాడ్జిలకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇకపై అలాంటి ఖర్చులు తగ్గేలా స్లీపింగ్ పాడ్స్ వచ్చేశాయి. క్యాప్సుల్‌ హోటల్స్‌ సౌకర్యాన్ని విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు పెట్టెలో బెడ్స్ లాగే స్లీపింగ్‌ పాడ్‌లను ఏర్పాటు చేశారు. తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో తొలిసారి ఈ రకమైన వసతిని ఏర్పాటు చేశామని డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా తెలిపారు. విశాఖ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో ఒకటో అంతస్తుపై ఈ స్లీపింగ్‌ పాడ్‌లు అందుబాటులో ఉంటాయి. 18 పడకలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. సింగిల్‌ బెడ్‌కు 3 గంటల వరకు ఒక్కొక్కరికి 200 రూపాయలు, అది దాటితే 24 గంటల వరకు ఒకరికి 400 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. డబుల్‌ బెడ్‌ అయితే 3 గంటల వరకు 300 రూపాయలు, ఆ తర్వాత 24 గంటల వరకైతే 600 రూపాయలు వసూలు చేస్తారు.

Tags:    

Similar News