Andhra Pradesh : హైకోర్టులో లిక్కర్ స్కామ్ నిందితులకు స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు

Update: 2025-09-08 07:48 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇప్పటికే నిందితులు బెయిల్ పై జైలు నుంచి విడుదలయినందున దీనిపై ఆదేశాలు ఇవ్వలేమని, నిందితులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మిగిలిన నిందితులకు...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలను నిలుపుదల చేయలేమని, నిందితులు బెయిల్ పై విడుదలయినందున వారికి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. అయితే మిగిలిన నిందితులకు బెయిల్ ఇవ్వవద్దంటూ కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. అయితే దీనిపై విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News