Tirumala : తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది

Update: 2026-01-23 06:36 GMT

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. అవినీతి నిరోధక శాఖ కోర్టులో ఈరోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో పది హేను నెలల పాటు సిట్ విచారణ కొనసాగింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించింది.

నేడు ఛార్జి షీటు ను...
ఈ సిట్ ఇప్పటికే చాలా మందిని విచారించింది. అనేక మందిని అదుపులోకి తీసుకుంది. నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని కూడా విచారణ చేసింది. అయితే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు కీలక సూత్రధారులుగా గుర్తించింది. తొలి ఛార్జ్‌షీట్‌లో 24 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్ అధికారులు మరో పన్నెండు మంది హస్తం ఉన్నట్లు సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.


Tags:    

Similar News