Andhra Pradesh : లిక్కర్ స్కామ్ కేసులో రజత్ భార్గవ్ కు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.

Update: 2025-07-10 04:06 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పదవీ విరమణ చేసి ఉన్నారు. ఈ కేసులో ఆయన స్టేట్ మెంట్ కీలకం కానుందని సిట్ అధికారులు భావిస్త్ున్నారు. రేపు ఉదయం పది గంటలకు సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని రజత్ భార్గవ్ కు నోటీసులు జారీ చేసింది.

భారీగా నష్టం జరిగిందని...
గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరిగిందని భావించి, దీనిపై విచారణ జరిపేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో దాదాపు తొమ్మిది మందిని విచారించిన సిట్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. రేపు రజత్ భార్గవ్ ఇచ్చే స్టేట్ మెంట్ కీలకమవుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News