Vijayawada : నవరాత్రుల్లో దుర్గగుడి ఆదాయం ఎంతో తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ముగిశాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు

Update: 2025-10-03 04:30 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ముగిశాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పది శాతం అధికంగా దుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ దుర్గగుడిపై భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.

పదిహేను లక్షల మంది...
అదే సమయంలో ఈ నవరాత్రుల సందర్భంగా దుర్గగుడి ఆదాయం 4.38 కోట్ల రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నవరాత్రుల్లో దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు దుర్గామాతను దర్శించుకున్నారని, అత్యధికంగా మూలా నక్షత్రం రోజున ఎక్కువ మంది భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. భవానీ భక్తులు కూడా అధిక సంఖ్యలో నేడు కూడా దుర్గమ్మ చెంతకు వస్తున్నారని తెలిపారు.


Tags:    

Similar News