Andhra Pradesh : అలరించిన శాసనసభ్యుల సాంస్కృతి కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి

Update: 2026-03-07 02:09 GMT

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రీడా పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండర్లుగా నిలిచారని అన్నారు. విజయవాడలోని ఆంత్రా లక్స్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. నేతల క్రీడల్లో చక్కగా రాణించారు. క్రీడోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్రలో జీవించారు.

నేతన్నలను ప్రోత్సహించేందుకు...
నేతన్నలను ప్రోత్సహించేందుకు మహిళా ప్రజా ప్రతినిధులు చేనేత వస్త్రాలు ధరించి రావడం అభింనందనీయం. ప్రతి ఒక్క నేత కలిసిమెలిసి కుటుంబంలా పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు. అంతకుముందు “హు ఈజ్ హు” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ శాసన మండలి సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్నకుమార్‌, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Tags:    

Similar News