Chandrababu : నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2026-03-07 02:28 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.ఈరోజు ఉదయం 10.50 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళతారు.ఢిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు జరుగుతుంది. మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు ఫిన్ లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.

సదస్సులో పాల్గొన్న అనంతరం...
‘జియో పాలిటిక్స్- జియో ఎకనామిక్స్’ అంశం ఆధారంగా ఈ సదస్సులో సాగనున్న చర్చలు జరగనున్నాయి. సాంకేతికత- సుపరిపాలన-భవిష్యత్... అనే అంశాలపై కీలక ఉపన్యాసం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్‌గా పౌర సేవలు అంశాలను వివరించనున్నారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు అనుసరిస్తున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తెలపనున్నారు. ఈ పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ కు చంద్రబాబు చేరుకుంటారు.


Tags:    

Similar News