వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరస కేసులు నమోదవుతున్నాయి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరస కేసులు నమోదవుతున్నాయి. గన్నవరం శివారులోని పద్దెనిమిది ఎకరాల్లో ఉన్న పానకాల చెరువు భూమి పై గతంలో రైతులను ఒత్తిడి చేసి, భూమి స్వాధీనం చేసుకున్నారంటూ కేసు నమోదయింది. మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళి కృష్ణ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశార.
నిబంధనలను...
వల్లభనేని వంశీ చెరువు అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించి మట్టి తవ్వకాలు చేసి అమ్ముకున్నారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. మట్టి తవ్వకాలు జరుపుతూ కోట్లాది రూపాయలు తన అనుచరులతో చేత కొల్లగొట్టారని, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి.