Kakani Govardhan Reddy : కాకాణి గోవర్థన్ రెడ్డిని ఏపీ రౌండప్ చేస్తున్నారే
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వరస కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై మరో కేసు నమోదయింది
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వరస కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై మరో కేసు నమోదయింది. గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా జైలు నుంచిఆయనను పీటీ వారెంట్ పై గుంటూరుకు కాకాణి గోవర్థన్ రెడ్డిని సీఐడీ పోలీసులు తరలించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ఆయనపై గుంటూరులో కేసు నమోదయింది.
మరో కేసు నమోదు...
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. మైనింగ్ ఆరోపణలపై ఆయన ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గుంటూరు కేసులో సీఐడీ పోలీసులు కాకాణి గోవర్థన్ రెడ్డిని కస్టడీ పిటీషన్ ను న్యాయస్థానంలో వేసే అవకాశముంది.